ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం..
కొల్చారంలో బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ ధర్నా
765డీ ప్రధాన రహదారిపై రాస్తారోకో.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు
కొల్చారం, :అసెంబ్లీ ప్రాంగణంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ సోమవారం కొల్చారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని 765డీ ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే పట్ల అవమానకరంగా ప్రవర్తించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా కారణంగా 765డీ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. “కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి రహదారి నుంచి పంపించారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కొల్చారం పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకుని మరోసారి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బీఆర్‌ఎస్ నాయకులు రాంపల్లి గౌరీశంకర్, యువత అధ్యక్షుడు సంతోష్ రావు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ అరిగి రమేష్ కుమార్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు యోహాన్ స్వామి, వినోద్ నాయక్, మోత్కు మల్లేశం, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మేఘమాల సంతోష్, మాజీ సర్పంచ్ కరెంటు రాజాగౌడ్, ధనరాజ్, సాయిని సిద్ధిరాములు, దుర్గ ప్రసాద్ గౌడ్, కోరంపల్లి గోపి, వేమారెడ్డి, అరికెల నాగయ్య, తాండ్ర వెంకటేశం, శ్రీను తదితరులు, వివిధ గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.