BREAKING
ఎమ్మెల్యే సునీత రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు దైవిక రహస్యాల నేపథ్యంలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ ఉత్కంఠభరిత ప్రయాణం! తెలంగాణలో బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్ నిబంధన.. పెనుభారంగా మారనున్న వాణిజ్య పన్నులు.. సామాన్యులపై పెరగనున్న ఛార్జీల మోత రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం గ్రామీణ నేపధ్యంలో సరికొత్త యాక్షన్ డ్రామా.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న మాధవ్ భూపతిరాజు 'మారెమ్మ' శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్.. లండన్ ఉద్యోగాల పేరిట కోట్ల దోపిడీ కేసులో చర్యలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి వెండితెరపై మరోసారి గూఢచారి పరాక్రమం: భారీ అంచనాల మధ్య రానున్న కార్తీ 'సర్దార్ 2' యూకే వీసా స్కామ్‌లో ‘నందూస్ వరల్డ్’ దంపతులు.. పోలీసుల అదుపులో కీలక నిందితులు! నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై ట్విస్ట్.. మార్పు తప్పదా? నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం. మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం మమ్ముట్టి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ పెట్రోల్–డీజిల్ ధరలు స్థిరం.. క్రూడ్ ఆయిల్‌పై అందరి చూపు!

ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి

Select Suryaa Now
ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి

ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి
420 హామీలు.. 13 గ్యారంటీలు.. అమలెప్పుడు?
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
హామీల అమలుకు ప్రజావాణిలో విజ్ఞప్తి
కాంగ్రెస్‌ ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి.

పటాన్ చెరు మేజర్ న్యూస్....కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని కోరుతూ ప్రజావాణిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 గ్యారంటీలు, 6 గ్యారంటీ పథకాల పేర్లను ప్రస్తావిస్తూ, వాటిలో అనేక హామీలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.
మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఉచిత బంగారం, ఉచిత విద్య వంటి హామీలను అమలు చేయాలని కోరారు. రైతులకు ప్రతి పంటకు రైతు భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం, పంటలకు మద్దతు ధర, ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, విద్యార్థులకు విద్యా భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్ల పెంపు వంటి హామీలను అమలు చేయాలని కోరారు.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి పెన్షన్లను పెంచడంతో పాటు, ఆడపిల్లల వివాహానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, యువజనులు, రైతులు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుని వాటిని కాపాడాలని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నియోజకవర్గంలోని ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రజావాణిలో ఈ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.