BREAKING
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై దేశవ్యాప్తంగా మొదలైన తీవ్ర చర్చ కొందుర్గు పిఏసిఎస్ నూతన చైర్మన్ గా అనిత జితేందర్ రెడ్డి. యూకే ఎయిర్‌బేస్ వద్ద ఐదుగురి అరెస్ట్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కిసాన్ మోర్చా జిల్లా నూతన కమిటీ నియామకం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: ప్రతిపక్షాలకు మంత్రి వీరాంజనేయులు తీవ్ర హెచ్చరిక బ్రిటన్ బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణే కీలక ప్రాధాన్యం విజయవాడ దసరా ఉత్సవాలకు ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా ఏర్పాట్లు: మంత్రి సత్యకుమార్ విద్య, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం: భట్టి విక్రమార్క పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ హోంగార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన విజయవాడ సీఐ అలీ మృతి కేసులో కీలక పురోగతి

ఎస్సీ యువతకు గోల్డెన్ ఛాన్స్

Select Suryaa Now
ఎస్సీ యువతకు గోల్డెన్ ఛాన్స్

 

ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28):నిరుద్యోగ ఎస్సీ యువతకు శుభవార్త. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి పద్మావతి తెలిపారు. ఆధునిక ఐటీ రంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.వెబ్ టెక్నాలజీస్‌లో నాలుగు నెలల కోర్సుతో పాటు జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులకు 18 ఏళ్లు పూర్తై, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి అబ్బాయిలు, అమ్మాయిలకు హాస్టల్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు.మరిన్ని వివరాలకు 7671980899, 494293610 నంబర్లను సంప్రదించాలని కోరారు.