telanagana
ఎల్లారెడ్డిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
సూర్యఎల్లారెడ్డి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలను ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కన్నులారా వీక్షించాలని ఆయన కోరారు.
పువ్వులు, చెట్లు, ప్రకృతిని దైవస్వరూపంగా భావించే గొప్ప సంప్రదాయం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రక గుర్తింపు కలిగిన పండుగ బతుకమ్మ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఈ పండుగను మహిళలతో పాటు ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
బతుకమ్మ నిమజ్జనాన్ని పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్
సద్దుల బతుకమ్మ వేడుకలకు సంబంధించి మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ సూర్య మేజర్ న్యూస్ కిు వివరించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సైతం ఎల్లారెడ్డి ప్రాంత మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో
మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జే. జగ్జీవన్, డీసీసీ ఉపాధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు నాగం గోపికృష్ణ, గఫార్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.