BREAKING
నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి

ఎల్ నినో ప్రభావం తొలగి వర్షాలు కురవాలి

Select Suryaa Now
ఎల్ నినో ప్రభావం తొలగి వర్షాలు కురవాలి

అమ్మవారికి ప్రత్యేక పూజలు - గంప వెంకటేష్ గుప్తా….

కడ్తాల్: ఎల్ నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ కడ్తాల్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా తెలిపారు.

సోమవారం మండల కేంద్రంలోని అభయాంజనేయ, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో గంప లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేష్ గుప్తా, వంశిక దంపతులు అర్చకులు వలిపే రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా భ్రమరాంబిక అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతకు దుర్గామాత మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అమ్మవారి కరుణతో వాతావరణం చల్లబడి పాడిపంటలు బాగా పండాలని మొక్కుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చాట్ల సర్వేశ, ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, నవీన్ గుప్తా, మిత్రమండలి అధ్యక్షుడు కర్ణాకర్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పాండు, వార్డు సభ్యులు మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.