ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు*
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తరలివెళ్లారు.
ఈ ర్యాలీలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారని పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ వద్ద సమావేశమైన కాంగ్రెస్ బృందం అక్కడి నుంచి ర్యాలీకి బయలుదేరింది. ఈ సందర్భంగా నేతలంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి చేపట్టిన పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ భాగస్వామ్యమవుతుందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
లక్ష్మణ్ మేజర్ న్యూస్ కడ్తాల్..