BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

భక్తులకు దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ

Select Suryaa Now
భక్తులకు దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ

 


రామాయంపేట ; నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ వార్షికోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో దంపతులచే అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి గ్రామస్తులు ఓడి బియ్యాన్ని సమర్పించారు. అలాగే సాయంత్రకాల పూజ లో దంపతుల పూజతో పాటు కుమారి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు.ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొండేరి ప్రభాకర్, ఉపాధ్యక్షులు జీడీ చంద్రకాంత్ గౌడ్, క్యాషియర్ మాసుల నాగరాజు, భానుక బిక్షపతి, చేరివిరాల కృష్ణమూర్తి, నాయిని రాజు, పంపరి శివకుమార్, వీరమల్లు బాలయ్యతో పాటు గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.