బతుకమ్మ వేడుకలకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఆర్ధిక సాయం
బతుకమ్మ వేడుకలకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఆర్ధిక సాయం
మణుగూరు ఆర్ సి సూర్య;పినపాక మండలంలోని భూపాలపట్నం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సర్పంచ్ స్వప్న తెలియజేశారు.శనివారం సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్న సందర్భంగా బతుకమ్మ గద్దె లను సందర్శించి వారితో ఆమె మాట్లాడారు.అనంతరం బతుకమ్మ గద్దెల వద్ద నిర్వాహకులకు ఒక్కొక్క గద్దెకు మూడు వేల రూపాయలను అందజేశారు. ఒక్కొక్క గద్దెకు సర్పంచ్ గా తాను రూ 2 వేలు, ఉప సర్పంచ్ నెట్టా శిరీష వెయ్యి రూపాయలు అందించినట్లు తెలియజేశారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా