అతి పెద్ద బతుకమ్మతో ఆకట్టుకున్న మునుగోడు మాజీ సర్పంచ్ మిరియాల వెంకన్న కుటుంబ సభ్యులు
మునుగోడు,మేజర్ న్యూస్:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మునుగోడు మాజీ సర్పంచ్ మిరియాల వెంకన్న కుటుంబ సభ్యులు ఆదివారం మండలంలోనే అతి పెద్ద బతుకమ్మను పేర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
మిరియాల వెంకన్న కుటుంబ సభ్యులు పేర్చిన భారీ బతుకమ్మ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.