అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలి
సూర్య, సెంటినరీకాలనీ :కమాన్ పూర్ మండలంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదివారం కమాన్ పూర్, గుండారం, పెరపల్లి గ్రామాల్లో పర్యటించి, దుర్గామాత అమ్మవార్లను దర్శించుకున్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బాపూజీ నగర్ లో తోట వీరయ్య ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, గుండారం గ్రామంలో భవాని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, రాజేందర్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, పెరపల్లి గ్రామంలో శ్రీ భవాని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, మరియు కనకదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, కమాన్ పూర్ కిష్టంపల్లె హనుమాన్ టెంపుల్ లో ప్రతిష్టించిన అమ్మవారిని, కమాన్ పూర్ సుభాష్ నగర్ లో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, మరియు కమాన్ పూర్ బస్టాండ్ వద్ద ఛత్రపతి శివాజీ యువసేన వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, మరియు కమాన్ పూర్ బస్ స్టాండ్ లో రానవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.