BREAKING
ఓటీటీలోకి రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్.. స్ట్రీమింగ్‌పై మరింత ఆలస్యం? వెంకన్న సన్నిధిలో ఐఏఎస్ నవ్య ఒగ్గుకళాకారుల నూతన కమిటీ ఎన్నిక… అధ్యక్షుడిగా జెనిగె కొండల్ తాగునీటి పైపులైన్ లీకేజ్ కి చర్యలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హీట్.. ఈ వారం ఎలిమినేషన్‌కు ఏడుగురు సభ్యులు డేంజర్ జోన్‌లో అదనపు గదులు మంజూరు చేయండి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ -రూ.11,085 కోట్లతో గ్రామ స్వరాజ్యానికి శంకుస్థాపన -గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్న ఘనత కూటమిదే -హర్షం వ్యక్తం చేసిన గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి *జలసిరి కార్యక్రమంలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం* ఆర్ఎంపీల గుర్తింపుకై ప్రభుత్వం చొరవ చూపాలి - నిర్మల్ జిల్లా బాధ్యులు ఆశమొల్ల మోహన్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి ఎల్టీ లైన్ తగిలి ఎద్దు మృతి కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ డిమాండ్ చేశారు తెలుగు ఇండస్ట్రీ నాకు తల్లిలాంటిది.. యాంకర్ సుమ కనకాల ఎమోషనల్ పోస్ట్ వైరల్

వ్యర్థాల బహిరంగ వేలంలో రికార్డు దుమ్ము.. ఎదులాపురం మున్సిపాలిటీకి రూ.13.50 లక్షల ఆదాయం

Select Suryaa Now
వ్యర్థాల బహిరంగ వేలంలో రికార్డు దుమ్ము.. ఎదులాపురం మున్సిపాలిటీకి రూ.13.50 లక్షల ఆదాయం

ఖమ్మం రురల్ సూర్య మేజర్ న్యూస్ :ఎదులాపురం మున్సిపాలిటీకి వ్యర్థాల వేలం భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. చికెన్‌, మటన్‌, చేపల వ్యర్థాల సేకరణ, తరలింపు హక్కులకు నిర్వహించిన బహిరంగ వేలంలో ఇద్దరు బిడ్డర్లు పోటీపడ్డారు. మున్సిపాలిటీ నిర్ణయించిన రూ.1.50 లక్షల డీడీ సమర్పించి వేలంలో పాల్గొన్న వారు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశారు. చివరకు రూ.13.50 లక్షల అత్యధిక బిడ్‌ వేసిన ఎం. రాములు వేలంలో విజేతగా నిలిచి హక్కులను కైవసం చేసుకున్నారు.
ఖజానాకు భారీ ఆదాయం
వేలం ద్వారా ఎదులాపురం మున్సిపాలిటీకి ఏకంగా రూ.13.50 లక్షల ఆదాయం సమకూరనుంది. ఈ హక్కుల కాలపరిమితి 31-03-2027 వరకు కొనసాగనుంది. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం చికెన్‌, మటన్‌, చేపల వ్యర్థాలను క్రమబద్ధంగా సేకరించి తరలించాల్సి ఉంటుంది. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడటంతో పాటు దుర్వాసన, అపరిశుభ్రతకు అడ్డుకట్ట వేసి పట్టణ పారిశుధ్యాన్ని కాపాడాల్సి ఉంటుంది.మున్సిపల్‌ నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాలను క్రమబద్ధంగా సేకరించి తరలించడం ద్వారా పట్టణంలో పారిశుధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు.