ముంబైలో సామాన్యులకు షాక్ - ఆటో, టాక్సీ ఛార్జీలు భారీగా పెంపు - జేబులకు చిల్లు పడినట్టే!
ముంబైలో తిరగడం ఇక ఖరీదైన వ్యవహారమే - ఆటో, టాక్సీ రేట్లు పెరిగిపోయాయి!మహారాష్ట్రలోని ముంబై నగర ప్రజలకు బిగ్ షాక్. ఆటో రిక్షా, టాక్సీ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. కొత్త ధరలు ఈ నెల నుండి అమల్లోకి రానున్నాయి.కొత్త ఛార్జీలు ఎంతంటే?ఆటో రిక్షా కనీస ఛార్జీ: రూ.27 కి పెంపు (గతంలో రూ.23 ఉండేది)టాక్సీ (కాలీ-పీలీ) కనీస ఛార్జీ: రూ.33 కి పెంపు (గతంలో రూ.28 ఉండేది)ప్రతి కిలోమీటరుకు కూడా అదనంగా రూ.2 నుండి రూ.3 వరకు పెంచారు.ఎందుకు పెంచారు?గత కొన్ని నెలలుగా CNG గ్యాస్ ధర, విడిభాగాల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని ఆటో, టాక్సీ యూనియన్లు చాలా రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం వారి డిమాండ్ కు తలొగ్గి ఛార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో రోజూ ఆటోల్లో, టాక్సీల్లో ప్రయాణించే లక్షలాది మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడనుంది.