BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

రేవంత్ పై కొండా సురేఖ ఫైర్

Select Suryaa Now
రేవంత్ పై కొండా సురేఖ ఫైర్

*సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెబుతున్నారని, అదే స్ఫూర్తితో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తన కుమార్తె స్వతంత్రంగా మాట్లాడిన విషయానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ అన్నారు. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

“పదేళ్లు సీఎంగా ఉంటాను” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన సురేఖ.. అది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వ్యాఖ్య కాదా అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బహిరంగంగా ప్రకటించడం పార్టీ నిర్ణయాలకు, క్రమశిక్షణకు సంబంధించిన అంశం కాదా అని నిలదీశారు.

తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా సురేఖ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను తనకు ఆపాదించి చర్యలు తీసుకోవడం న్యాయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రత గురించి పార్టీ అగ్రనేతలు చెబుతున్న విషయాలను ఆచరణలోనూ పాటించాలని సూచించారు.

ఈ వ్యవహారంలో తనపై మాత్రమే కాకుండా, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలను ఒకే విధంగా పరిశీలించాలని సురేఖ కోరినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.