జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం
ఉద్యమాల గడ్డ జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం అవుతుందని బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆరు గ్యాంటీలు, 420 హామీల వైఫల్యాలపై జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలి చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దెబ్బకు ఓటుకు నోటు సూత్రధారి చంద్ర బాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు. రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు పోరాటం చేస్తామని, రాష్ట్రంలో నడిచేది రావణ పాలన అన్నారు.