దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
--ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...
నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో వైఎస్సార్ చిత్రపటానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ చూపిన బాటలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలు, రైతులు, మహిళలు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.