BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..

Select Suryaa Now
కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..

కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..వెయ్యి రోజులు గడిచినా అమలుకు నోచుకోని హామీలు..420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన,ప్రజలకు ‘బాకీ కార్డుల’ పంపిణీ..

మెదక్ ; కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం మెదక్‌లో నిరసన చేపట్టారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి.సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి నెరవేర్చని హామీలు  420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ‘బాకీ కార్డులు’ ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వివరిస్తూ పంపిణీ చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.