BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లాలో బుధవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు సగం భాగం బావిపై వేలాడుతూ ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుందరగిరి శివారుకు చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.