BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

కొమురం భీమ్ కాలనీలో వెలుగులు నింపిన సర్పంచ్ ప్రవీణ్ నాయక్

Select Suryaa Now
కొమురం భీమ్ కాలనీలో వెలుగులు నింపిన సర్పంచ్ ప్రవీణ్ నాయక్

బయ్యారం, మేజర్ న్యూస్, దాదాపు 60 సంవత్సరాలుగా విద్యుత్ వెలుగులకు నోచుకోక నిరాదరణకు గురైన కొత్తపేట పంచాయతీ పరిధిలోని కొమరం భీమ్ కాలనీలో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు వికసించాయి.ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ కాలనీ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు.కాలనీ వాసుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'జ్వాలా' పథకం కింద ప్రత్యేక చొరవ తీసుకుని 14 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి,వీధిలైట్లను వెలిగించారు. దీంతో దశాబ్దాల చీకట్లు తొలగిపోయి కాలనీ అంతా విద్యుత్ కాంతులతో జిగేల్మంటోంది.కేవలం విద్యుద్దీకరణే కాకుండా,కాలనీలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు సర్పంచ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ నిధులతో బీటీ రోడ్డును, అలాగే ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సీసీ రోడ్డును నిర్మించి రవాణా కష్టాలను దూరం చేశారు.తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ కాలనీని అభివృద్ధే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న సర్పంచ్ ప్రవీణ్ నాయక్ పనితీరుపై కొమరం భీమ్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రావి వీరభద్రరావు, 9వ వార్డు సభ్యులు ఈసం స్వరూప, వడ్లమూడి కోటేశ్వరరావు, పెండ్యాల శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు మెస్సు రాజేష్, వట్టం వెంకటేష్, మెస్సు సురేష్, దనసరి వీరభద్రం, యూత్ అధ్యక్షులు ఉదయ్, ఈసం రామ్మూర్తి, పుల్లూరు బాలరాజు, వంగురు ఆనంద్, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: స్వామి, బయ్యారం, మహబూబాద్ జిల్లా