BREAKING
ఎన్నికల వేళ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ సంతమాగులూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏ. బాలకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి నాలుగో రోజు దుర్గామాత పూజలు ఏపీలో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి చైనా సోలార్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత...ఓవర్‌క్యాపాసిటీ సంక్షోభం గౌతమి స్కూల్ అధినేత బొల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చిలీలోని ఎస్కొండిడా రాగి గనిలో సమ్మెకు దిగిన సూపర్వైజర్లు సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు బ్యాంక్ ఆఫ్ అమెరికాపై 1.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన అమెరికా ప్రభుత్వం ఉపాధిహామీ పై ప్రజావేదిక అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వెన్నెముక స్క్రీనింగ్ ప్యాకేజీ బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు భారతీయ మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఏఐ ప్రాక్సీ ట్రేడింగ్ రంగం

చక్రయాత్ర - నవదుర్గ దర్శనం- 4 అనాహతంలో చిరునవ్వు - కూష్మాండా దర్శనం (సృష్టికి మూలం - చిరునవ్వుతోనే విశ్వాన్ని సృష్టించిన తల్లి)

Select Suryaa Now
చక్రయాత్ర - నవదుర్గ దర్శనం- 4 అనాహతంలో చిరునవ్వు - కూష్మాండా దర్శనం  (సృష్టికి మూలం - చిరునవ్వుతోనే విశ్వాన్ని సృష్టించిన తల్లి)

చక్రయాత్ర - నవదుర్గ దర్శనం- 4

అనాహతంలో చిరునవ్వు - కూష్మాండా దర్శనం 

(సృష్టికి మూలం - చిరునవ్వుతోనే విశ్వాన్ని సృష్టించిన తల్లి)

 

:కూష్మాండాదుర్గా ధ్యానశ్లోకం:

"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే"

 

నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. "కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయి.

 

:పాలక గ్రహం: కుష్మండ దేవి సూర్యుడికి దిశ మరియు శక్తిని అందిస్తుంది.  అందువల్ల  సూర్యభగవానుని కుష్మండ దేవత నిర్వహిస్తుంది

:కుష్మండ దేవత ఇష్టమైన పువ్వు: ఎరుపు రంగు పువ్వులు

:కుష్మండ దేవత మంత్రం: దేవ్యై  కూష్మాండ్యైనమహః       

:కూష్మాండాదుర్గా రూపం వర్ణన:

కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం,  ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి/సింహం. విశ్వ సృష్టికర్తగా గౌరవించబడే కూష్మాండ దుర్గ అనహత చక్రంతో ముడిపడి ఉంది. ఈ చక్రం ప్రేమ, కరుణ మరియు సమతుల్యతకు కేంద్రం. కూష్మాండ శక్తి  ప్రేమ, సామరస్యం మరియు అన్ని జీవులతో పరస్పర సంబంధం యొక్క భావాన్ని పెంపొందిస్తుంది, భావోద్వేగ స్వస్థత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

:విశ్వ ఆవిర్భావం:

ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి, తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండా దుర్గా దేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం.

:త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి :

:మహాకాళీ :

కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో, నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు, తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.

:మహాలక్ష్మి:

కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.

:మహాసరస్వతి:

కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి, తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని, తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.

:శక్తి :

కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే, ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది.  అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి,  నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన  శివుడు,  శక్తి(సరస్వతీదేవి) లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.

:బ్రహ్మ/లక్ష్మీ:

కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.

:కుష్మండ దుర్గా ఆలయం:

వారణాసిలో  నవదుర్గ ఆలయాలు  ప్రత్యేకమైనవి. ఈ ఆలయం దుర్గా కుండ్ వద్ద ఉంది.  దీనిని మంకీ టెంపుల్ లేదా దుర్గా మందిర్ అంటారు.వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి, దుర్గా కుండ్ మందిర్ లేదా మంకీ టెంపుల్ మా దుర్గకు అంకితం చేయబడింది.  18 వ శతాబ్దంలో బెంగాల్ రాణిచే నిర్మించబడిన ఈ ఆలయంలో ఒక కుండ్ లేదా చిన్న దీర్ఘచతురస్రాకార జలాశయం ఉంది, ఇది అంతకు ముందు గంగానదికి అనుసంధానించబడి ఉంది.  నగరంలోని చాలా దేవాలయాల మాదిరిగానే, ఈ ఆలయంలో కూడా దీనికి సంబంధించిన కథ ఉంది, మరియు దేవత యొక్క విగ్రహం ఇక్కడ స్వయంగా కనిపించిందని మరియు ఏ వ్యక్తి చేత సృష్టించబడలేదని చెప్పబడింది.  ఇది హిందువుల పవిత్ర గ్రంథమైన దేవి భాగవత పురాణంలో కూడా దాని ప్రస్తావనను కనుగొంది.  దుర్గాదేవి పవిత్ర నగరమైన వారణాసిని అనేక శతాబ్దాలుగా రక్షించిందని చెబుతారు.  ఈ నిర్మాణం ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.  ఎరుపు మరియు ఓచర్ పెయింట్ చేసి  ఉంది.  మంకీ టెంపుల్ అంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో కోతులు ఉన్నందున దీనికి ఇచ్చిన పేరు.

అమ్మవారి నైవేద్యం …

నవరాత్రి ఉత్సవాలలో ప్రతి   నాల్గవ  రోజు శుక్లపక్షంలో దీన్ని జరుపుకుంటారు. కూష్మాండా దుర్గా  అమ్మవారిని పూజిస్తారు దేవికి  ప్రసాదంగా ఉపవాసాలు పాటించడం మరియు మాల్పువాను భోగ్‌గా అర్పించడం చేస్తూవుంటారు

కుష్మండ దేవత స్తుతి …

యాదేవీ సర్వభూతేషు కూష్మాండ

రూపేణ సంస్థితా నమస్తస్మై

 నమస్తస్మై నమస్తస్మై నమో నమః

::::::::::::::::::::::::::::::::::::::::::::::

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారములు కనకదుర్గమ్మ కి 10 రోజులు 10 అలంకారములు చేస్తారు. అందులో భాగంగా అక్టోబరు 14   బుధ వారం ఆశ్వీజ శుద్ధ చవితి  “శ్రీ మహా చండీ” గా(మీనాక్షి దేవిగా)  నాల్గవ రోజు అలంకారము చేస్తారు. 

అమ్మవారికి నైవేద్యము: బెల్లంఅన్నం,  అల్లం గారెలు

అమ్మవారి చీర అలంకారం:  బంగారం రంగు, ఆకుపచ్చ రంగు

*********-----************

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com