యువత అండ.. భాస్కర్‌కు ప్రజాదండ!
గాజువాక, సూర్య : జీవీఎంసీ 99వ వార్డు ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలను వెనక్కినెట్టి స్వతంత్ర అభ్యర్థి గోకాడ భాస్కర్ దూసుకుపోతున్నారు. గత నాయకుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు, నిస్వార్థంగా సేవలందించే యువతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల నాయకులు, ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా భాస్కర్‌కు మద్దతుగా నిలుస్తుండటంతో ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వార్డు పరిధిలో వీధి దీపాల ఏర్పాటు, ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ ఫెన్సింగ్, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని నింపింది. ఎన్నికల్లో గెలుపు కంటే ప్రజల నమ్మకం, వారి సమస్యల పరిష్కారమే పరమావధిగా భావిస్తూ ఆయన వార్డులో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు.
రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.