BREAKING
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశారు.. ది ప్యారడైజ్ మూవీపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు అనంతపురంలో అల్ట్రావయోలెట్ యూవీ స్పేస్ స్టేషన్ ప్రారంభం సెప్టెంబర్‌లో రూ.2.03 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు పోషకాహార లోపం నివారణలో అంగన్వాడీలు కీలకం సనాతన ధర్మంలో గురువుల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ! పోలేరమ్మ తల్లి సేవలో సోమిరెడ్డి 15 పతకాలతో అదరగొట్టిన మన షూటర్లు మూగజీవాల పట్ల ఏనుగు అపారమైన దయ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయాలను హత్తుకునే దృశ్యాలు జనసేనలోకి తాడివలస జయప్రకాష్.. కండువా కప్పి ఆహ్వానించిన గురాన అయ్యలు సురక్ష యాప్ ద్వారా మద్యం విక్రయాలు జరపాలి. చింతలపూడి ఎక్సైజ్ సి ఐ ఫిల్మ్‌ ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ భేటీకి అనుమతించకపోవడంపై సుమలత ఆందోళన చింతపల్లిలో హెచ్‌డీపీఎస్‌ పత్తిపై రైతులకు శిక్షణా కార్యక్రమం*. పేదల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం “ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించాలి” — జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయం. అక్టోబర్ 5 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ పర్యటన

వృద్ధులకు తోడుగా నిలవడమే నిజమైన గౌరవం

Select Suryaa Now
వృద్ధులకు తోడుగా నిలవడమే నిజమైన గౌరవం

వృద్ధులకు తోడుగా నిలవడమే నిజమైన గౌరవం

డాక్టర్‌ అడ్డాల సత్యనారాయణ

కాకినాడ: చిన్నతనంలో నడక నేర్పిన పెద్దలకు వృద్ధాప్యంలో తోడుగా నిలవడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవమని శ్రీ సత్య దంత వైద్యశాల వైద్యుడు డాక్టర్‌ అడ్డాల సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక రెడ్‌క్రాస్‌ సొసైటీ వృద్ధాశ్రమంలో ఆయన ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులతో కుటుంబ సభ్యులు కొంత సమయం గడపాలని, వారి మాటలను ఓపికగా వినాలని సూచించారు. జీవితాంతం కుటుంబం, సమాజం కోసం శ్రమించిన వారిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వారి ఆరోగ్యం, ఆహారం, మందులతోపాటు మానసిక ఉల్లాసంపైనా శ్రద్ధ చూపాలన్నారు. పెద్దల జీవిత అనుభవం, జ్ఞానం భావితరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డాక్టర్‌ రామ్‌చరణ్‌, వీరభద్రరావు, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు.