వైసిపి అభ్యర్థి ముని మాధవి తులసీరావు విస్తృత ప్రచారం
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ,13వ వార్డు ఆదర్శనగర్ 73,76 బూత్ ఇంచార్జ్, వార్డు మహిళా అధ్యక్షురాలు ఇట్ల వరలక్ష్మి, కారుముడి రాధ, ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ముని మాధవి తులసీరావు గురువారం విస్తృత ప్రచారంలో స్థానిక ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుతూ విశేష ఆదరణ చూపించారు. ప్రతీ ఇంటి తలుపు తట్టి ఆనాటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈనాటి కూటమి ప్రభుత్వం పాలనలో నిత్యావసరాల ధరల వ్యత్యాసం ప్రజలకు విపులంగా వివరిస్తూ ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కంట్రెడ్డి రామన్న పాత్రుడు,జిల్లా పార్టీ కార్యదర్శి బోండా శ్రీనివాస్, నియోజకవర్గ అయ్యారక విభాగం అధ్యక్షులు దన్నిన సత్యనారాయణ, వార్డు వైస్ ప్రెసిడెంట్ గంగుల ఆనంద్,వార్డు జనరల్ సెక్రటరీ కిలపర్తి గోవిందు, వార్డు మున్సిపల్ విభాగం అధ్యక్షుడు చింతా శ్రీను, వార్డు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నంబలా అప్పారావు, వార్డు ప్రచార విభాగం అధ్యక్షులు రౌతు సంతోష్ , బి ఎల్ ఏ లు శేఖర్, జయ శ్రీ, దేవి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.