BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.

వైఎస్సార్‌సీపీ నుంచి 24, టీడీపీ నుంచి 14, జనసేన నుంచి 8 నామినేషన్లు

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీ నుంచి 24, టీడీపీ నుంచి 14, జనసేన నుంచి 8 నామినేషన్లు

తణుకు,సూర్య న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా తణుకు మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. గురువారం రెండో రోజు వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి మొత్తం 53 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ వెల్లడించారు.

రెండో రోజు దాఖలైన నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 24 నామినేషన్లు దాఖలు కాగా, తెలుగుదేశం పార్టీ నుంచి 14, జనసేన పార్టీ నుంచి 8 నామినేషన్లు నమోదయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి 2, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2, సీపీఐ(ఎం) నుంచి ఒకటి, భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థి నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు తెలిపారు.మొత్తంగా ఎనిమిది పార్టీలవారీ, స్వతంత్ర విభాగాల కింద 53 నామినేషన్లు నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి వివరించారు. స్థానిక ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో కీలకమైన ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు రిటర్నింగ్ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ తెలిపారు

.రిపోర్టర్..అనుకుమార్. ..తణుకు. ...పశ్చిమగోదావరి జిల్లా.