BREAKING
వరుణ దేవుని ఆశీస్సులతో రైతాంగం సుభిక్షంగా ఉండాలి : ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రతి ఇంటికీ సోలార్‌ భరోసా.. - పెనమలూరులో 10 వేల ఇళ్లకు సోలార్‌ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జనవరి 15 నాటికి పేదల ఇళ్లు సిద్ధం - లబ్ధిదారులతో గృహప్రవేశాలు, సహపంక్తి భోజనాలు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉయ్యూరు నుంచే కూటమి విజయయాత్రకు శంఖారావం.. అభివృద్ధిలో పోటీ పడదాం.. నూతన కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ విధులపై సూచనలు డ్రైవర్‌ రామ్‌కుమార్‌ ఆత్మహత్య భర్త బతికే ఉన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం - పింఛన్ కోసం నకిలీ పత్రాలు.. ఈనెల 8వ తేదీ న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవాడ ఉత్సవ్‌ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం.. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ వైభవం గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం గుర్తుతెలియని ఒక శవం

ఉత్తమ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థుల ఘన సన్మాన

Select Suryaa Now
ఉత్తమ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థుల ఘన సన్మాన

నేటి దినపత్రిక సూర్య హీరో రాజమహేంద్రవరం

తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు. 2007లో కడియం మండలం మురమండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువులకు లభించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల నేపథ్యంలో ఒక్కటయ్యారు.

గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 5న జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న అదే పాఠశాల ఉపాధ్యాయులు సంధ్యారాణి, సుజాతలను పూర్వ విద్యార్థులు కలిసి ఘనంగా సత్కరించారు. శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఉపాధ్యాయులను గౌరవించి తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను గౌరవించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో తూలూరి రాజు, కొప్పాక రమణ, బుష్కా రవి, గుంటూరి లక్ష్మణ్, దూది సురేష్, సీతిన శ్రీను, గుత్తుల ప్రసాద్, అడ్డాల దాసు, చెలప వెంకటస్వామి, వారణాసి నాగు, లలిత టేకి, కోమలి తదితరులు పాల్గొన్నారు.