BREAKING
నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు అధికారుల వైఫల్యంతోనే కర్నూలు జిల్లాకు కరువు మండలాలు రాలేదు వైభవంగా ప్రారంభమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు. మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన బొక్క నరసింహారెడ్డి జర్మనీలో విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన..డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక అనారోగ్యంతో బాధపడుతున్న కామసాని శేషిరెడ్డి పరామర్శ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 'మారెమ్మ'.. ఏకకాలంలో రెండు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్! శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలంకరణలో అమ్మవారు మృతుల కుటంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే జిబౌటి-యెమెన్ సముద్రంలో మునిగిన పడవ..15 మంది పిల్లలతో సహా 109 మంది మృతి కూటమి పాలనలో ప్రజల అస్తులకు రక్షణ కరువు – రెండున్నరేళ్లుగా అనంతపురంలో దౌర్జన్యాలు – స్థానిక ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నాలు – కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి – వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి బోరు మోటారు స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతం.. రైతు మృతి ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకోనున్న పోప్ లియో రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి నిరంతర కృషి స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి నూతిమడుగులో పార్టీ ఐడీ కార్డుల పంపిణీ.. శ్రేణులకు తలారి రంగయ్య దిశానిర్దేశం

టిడిపిలోకి చేరికలు

Select Suryaa Now
టిడిపిలోకి చేరికలు

 

 వైసీపీని వీడి టిడిపిలోకి చేరికలు

సూర్య, కందుకూరు : కందుకూరి నియోజకవర్గ లింగసముద్రం మండలం ఆర్ఆర్ పాలెం చెందిన కుటుంబాలు వైసిపి ని వీడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.గ్రామ టిడిపి నాయకులు, మాజీ సర్పంచ్ చండ్ర తిరుపతయ్య, చింతగుంపల వీరభద్రయ్య, మాలకొండయ్య, సుబ్బారావు, చొప్పర తిరుపాలు, రొడ్డా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే నాగేశ్వరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గడిచిన రెండేళ్లలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.... పార్టీలో చేరిన వారు తెలిపారు. కూటమి పాలన... జగన్ పాలన కంటే ఎన్నో రెట్లు బాగుందన్నారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో మంచి సానుకూలత ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, క్లస్టర్ ఇంచార్జ్ వంకాయలపాటి మాల్యాద్రి, ఉన్నం వీరాస్వామి, చింతగుంపల మనోహర్, రామకృష్ణ, చండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.