BREAKING
శ్రీ పరమేశ..ఆశీర్వదించండి! -- అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పార్థసారథి ప్రత్యేక పూజలు బతుకమ్మ, సంబరాల ఏర్పాట్లను పరిశీలించిన ఏరియా జీఎం రాధాకృష్ణ మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి కార్పొరేటర్ టికెట్ కోహీర్ యువతకు కాంగ్రెస్ నాయకుల క్రికెట్ కిట్ అందజేత 35వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా బంగి నాగ నామినేషన్ దాఖలు! అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు వస్తాకొండూర్ లో భక్తి జాతర.. దుర్గమ్మ చెంత భారీ అన్నదాన కార్యక్రమం* దుర్గామాత మండపాల్లో మారబోయిన రవి యాదవ్ ప్రత్యేక పూజలు టిడిపి తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా ధనలక్ష్మి ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గాంధీ సర్ ప్రక్రియలో ఓటర్ల సమస్యలను పరిష్కరించాలి అధికారులకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ విజ్ఞప్తి ప్రమాదాలు జరుగుతున్నాయి గుంతలు పుడపించండి. నీటిని పొదుపుగా వాడుకోవాలి : జనసేన అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు.

టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Select Suryaa Now
టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

- పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపు

పామూరు, మేజర్ న్యూస్ : 

 నవంబర్‌ 3న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు, ఎంపీపీ అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు శనివారం పామూరు పట్టణంలోని శేషమహల్‌ ప్రాంగణంలో పువ్వాడి క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. టీడీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులతో మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్నారు. పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారి వివరాలతో జాబితాను రూపొందించి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి పంపనున్నట్లు పువ్వాడి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి టీడీపీకి ఘన విజయాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, బొల్లా నరసింహారావు, యారవ శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, గుంటుపల్లి శ్రీనివాసులు, బైరెడ్డి జయరామిరెడ్డి, యారవ ప్రసాద్ రెడ్డి, సయ్యద్ అమీర్ బాబు, పాలపర్తి వెంకటేశ్వర్లు, మార్నేని రామకృష్ణ, దయండే శివశంకర్, కల్లూరి తిరుపతయ్య, కంచర్ల శ్రీనివాసులు, మన్నం రమణయ్య, ఏలూరి మాధవరావు, పునుగుపాటి మాల్యాద్రి, రేగలగడ్డ కోటయ్య, కొప్పల్లి నాగేశ్వరరావు, మోరుబోయిన నరసింహారావు, తెల్లజాల ప్రసాద్, మోరు బోయిన గిడ్డయ్య యాదవ్ మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.