సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ బిల్లులు ఆదా
ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమాకాంత్
కనిగిరి ,మేజర్ న్యూస్ :గృహాల పై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులు ఆదా తోపాటు ఆదాయం పొందవచ్చునని కనిగిరి డివిజన్ విద్యుత్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ ఉమా కాంత్ తెలిపారు .పట్టణంలోని పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా సేవా సేతు అభియాన్ పీఎం సూర్య ఘర్ పై అవగాహనా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు . ఈ సంధర్భంగా ఆర్ ఉమాకాంత్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ను గృహ అవసరాలకు వాడుకొని మిగులు విద్యుత్ ద్వారా ఆదాయం పొందవచ్చని చెప్పారు .పిఎం సూర్య ఘర్ ద్వారా కిలోవాటుకు 30 వేలు ,రెండు కిలోవాట్లకు 60 వేలు ,మూడు కిలోవాట్లకి గరిష్టంగా 78 వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు .డిపార్ట్మెంట్ సిబ్బంది ,వెండర్లు ,బ్యాంకర్లు ,సాంకేతిక సభ్యులు ఒకే చోట అందుబాటులో ఉంటారని తెలియజేశారు.ఈ మూడు రోజులే కాకుండా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈ పవన్ కుమార్ ,పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి ,టీడీపి నాయకులు షేక్ జంషీర్ ,షేక్ రహీమాన్ ,షేక్ షరీఫ్ వెండర్లు ,వినియోగదారులు పాల్గొన్నారు .