BREAKING
సిపిఎస్ రద్దు చేయాలి -పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలి తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్ లోని 48 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సిపిఎస్ ఎ ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

సమగ్ర శిక్ష పార్ట్ టైం టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి

Select Suryaa Now
సమగ్ర శిక్ష పార్ట్ టైం టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లుగా సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. కలెక్టరేట్ వద్ద నిరసన అనంతరం డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్లను విద్యాశాఖలో విలీనం చేసి సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఎస్జీటీ స్కేల్ ప్రకారం రూ. 32,670 వేతనం చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు.డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేయాలని, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డు, ఈపీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని, మరణ పరిహారాన్ని రూ. 5 లక్షలకు, ప్రమాద మరణ పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శాంతి, సుధాకర్, మాధవి, సాదిక్, రవి, నవీన్, రాజేష్ పాల్గొన్నారు.