BREAKING
ఎక్మాయ్ గ్రామానికి పీఏసీఎస్ డైరెక్టర్ పదవి అమలాపురంలో సందడి చేసిన హీరోయిన్ మెహ్రీన్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యున్ని నియమించాలి చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించేందుకు సుడాలగుంట షుగర్స్ అంగీకారం తుపాను పంట నష్టం అంచనాలను వేగవంతం చేయండి టాటా గ్రూప్ షేర్లలో క్షీణత మయన్మార్ శరణార్థుల నిర్బంధ తరలింపును ప్రారంభించిన మలేషియా చిలీ సెంటినెలా రాగి గనిలో సమ్మె దిశగా కార్మికులు కరువు కంటే బంపర్ దిగుబడికే భయపడుతున్న రాయలసీమ రైతులు జనరల్ మోటార్స్ సాంకేతిక ఖర్చులు $20.4 బిలియన్లు తగ్గుతాయన్న అమెరికా ప్రభుత్వం తాండూరులో స్పెషల్ డ్రైవ్.. అభివృద్ధి పనులకు వేగం పెంచాలి రష్యాకు బలవంతంగా తరలించిన ఉక్రెయిన్ పిల్లల కోసం ఆర్థిక సాయాన్ని పెంచిన నార్వే కొల్లబైలు–1లో డ్రైనేజీ సమస్య.. ప్రజల అవస్థలు నల్లగుట్ట పక్కన ఏసీ గోడౌన్ బ్యాక్‌సైడ్‌లో రోడ్డుపైనే మురుగునీరు పంజాబ్ ఎల్‌పీయూలో తీవ్ర ఉద్రిక్తత, విధ్వంసం..భయంతో సొంతూళ్లకు పయనమైన తెలుగు విద్యార్థులు బ్రేకులు వేసినా తగ్గని వేగం!

సాయి నగర్ లో చైన్ స్నాచింగ్ ... ఆందోళనలో ప్రజలు...

Select Suryaa Now
సాయి నగర్ లో చైన్  స్నాచింగ్ ...           ఆందోళనలో ప్రజలు...

అనంతపురం బ్యూరో 

 

సాయి నగర్ లో చైన్  స్నాచింగ్ ...           ఆందోళనలో ప్రజలు…

 

             అనంతపురం నగరంలోని సాయి నగర్ ఆరో క్రాసులో ఈ రోజు ఉదయం 7. 18 నిమిషాలకు చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు పల్సర్ బైక్ లో వచ్చి కాపుగాచి ఆరో క్రాస్ లోని తూర్పు వైపు ఉన్న ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని మంగళసూత్రం చైను లాక్కుపోయారు. బైక్లో డ్రైవ్ చేస్తున్న ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోని ఉండగా, వెనక కూర్చున్న మరో యువకుడు మాస్క్ వేసుకొని ఉన్నాడు. ఇంటికి వెళ్తున్న మహిళకు ఎదురుగా వెళ్లి లాఘవంగా మెడలోని చైన్ లాక్కొని పారిపోయారు. శ్యామల అనే మహిళ జనరల్ స్టోర్ కి వెళ్లి తిరిగి తన ఇంటికి వెళుతుండగా, ఆ మహిళ మెడలో నుంచి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. డయల్ 100కు ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 2టౌన్ సీఐ పుల్లయ్య, పోలీసులు  సంఘటన స్థలంలో , బాధితురాలు ఇంటి వద్ద విచారణ చేపట్టారు. సమీపంలోని ఓ సి సి ఫుటేజీలో ఇద్దరు యువకులు చోరీ చేస్తున్న వీడియో రికార్డు అయింది. చోరీ చేసినానంతరం యువకులు ఇద్దరు అక్బర్ హాస్పిటల్ మీదుగా మెయిన్ రోడ్డు వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మంగళసూత్రం చైన్ సుమారు మూడున్నర తులం ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఘటన స్థలం పరిసరాల్లో ఉన్న సిసి ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదేవిధంగా నగరంలోని మరో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగినట్టు సమాచారం.