BREAKING
హాకీని ప్రోత్సహించాలి గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రభాకర్‌రెడ్డి ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ మకుటం గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం మంత్రి సుభాష్ జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సాయం ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ రికార్డు 20 ఏళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారం ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం,మిక్స్‌డ్ రిలేలో సరికొత్త జాతీయ రికార్డు నమోదు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల 23వ అహుడ అథారిటీ సమావేశం రెవెన్యూ సిబ్బంది పనితీరుపై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కు ఫిర్యాదు కృష్ణపట్నం లో వైద్య శిబిరం న్యాయ విద్యతో రాజ్యాంగ విలువల పరిరక్షణ లా విద్యార్థులతో ఎంపీ అంబికా పల్లె పండుగకు పామూరు నుంచి భారీగా తరలిన కూటమి శ్రేణులు ఏపీ మోడల్ స్కూల్‌లో ఘనంగా ఎస్ఎంసీ ఎన్నికలు. చైల్డ్ కేర్ హోమ్స్ సిబ్బందికి శిక్షణ

ప్రొద్దుటూరు అభివృద్ధే లక్ష్యం..! అధికారులతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష

Select Suryaa Now
ప్రొద్దుటూరు అభివృద్ధే లక్ష్యం..!  అధికారులతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

కడప జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ శాఖల పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై జిల్లా సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం కడప కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు.

శాఖల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష

సమావేశంలో జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, శాఖల వారీగా సాధించిన ప్రగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం సమావేశ అజెండాలో పొందుపరిచిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు వివరాలు వెల్లడించారు. తమ శాఖల పరిధిలో చేపట్టిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలు, సాధించిన పురోగతి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలను ప్రజాప్రతినిధులకు వివరించారు.

ప్రొద్దుటూరు సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే

సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో అవసరమైన చర్యలపై చర్చించారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గానికి అవసరమైన కొత్త అభివృద్ధి ప్రతిపాదనలపై సంబంధిత శాఖల అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే పనులను మరింత వేగంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలపై సంబంధిత శాఖలు స్పందించి సకాలంలో పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరారు.

పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిధిమీనా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.