(అనంతపురం విద్య మేజర్ న్యూస్ )2026లో జరగనున్న పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్లు, గ్రామ పంచాయతీల ఎన్నికల విధుల నుంచి గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, అరవై ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని ఏపీ పీఎఫ్ 1938 ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు ఉపాధ్యాయ సమాఖ్య 1938 అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయలక్ష్మికి, జిల్లా విద్యాశాఖాధికారి అయ్యుబ్ హుస్సేన్కు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజు ప్రత్యేక విధుల మినహాయింపు సౌకర్యం కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులు, వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి హనుమప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు సాకే భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ రఫీ, రాష్ట్ర మండలి సభ్యుడు ఆంజనేయులు నాయక్, బుక్కరాయసముద్రం మండల నాయకుడు షమీవుల్లా, ఉరవకొండ మండల ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.