ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ
ఆమదాలవలస, సూర్య : మండల ప్రాదేశికం ఎన్నికల సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. నారాయణరావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు మూడు రోజులుగా ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కోసం నామినేషన్ లను స్వీకరించడం జరిగిందన్నారు. ఆమదాలవలస మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు గాను ఆఖరి రోజు శుక్రవారం వివిధ పార్టీల అభ్యర్థుల నుండి 28 నామినేషన్ పత్రాలను స్వీకరించినట్టు ఆయన తెలిపారు. బుధవారం 9 నామినేషన్లు, గురువారం 36 నామినేషన్లు సేకరించమని చెప్పారు. మొత్తంగా 73 నామినేషన్లు స్వీకరించమని చెప్పారు. టిడిపి నుంచి 25, వైసీపీ నుండి 36, జనసేన పార్టీ నుండి 5, కాంగ్రెస్ 2, బిజెపి 1, స్వతంత్రులు 4, మొత్తంగా మూడు రోజుల్లో 73 నామినేషన్ స్వీకరించమన్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు శాంతి భద్రతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు అధికారులు అందరూ పాల్గొని సహకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏ ఆర్ ఓ లు ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు, తహసిల్దార్ జి. సత్యంలను, ఇతర సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.నారాయణరావు అభినందించారు.
రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.