పెద్ద రంగాపురంలో తాగునీటి సమస్య తీర్చిన వైయస్ మనోహర్ రెడ్డి
వైఎస్ మనోహర్ రెడ్డి చొరవతో పెద్దరంగాపురంలో తీరుతున్న తాగునీటి సమస్య
పులివెందుల మేజర్ న్యూస్:
పెద్దరంగాపురం గత కొంతకాలంగా పెద్దరంగాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపల్ ఇన్‌చార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
ఇటీవల ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యను గుర్తించి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సొంత నిధులతో బోర్ మోటార్‌ను మరమ్మతు చేయించిన విషయం తెలిసిందే.
తాజాగా గ్రామంలోని మరో బోర్ మోటార్‌కు అవసరమైన విద్యుదీకరణ పనులను వైఎస్ మనోహర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఏర్పాటు చేయించారు. దీంతో ఆ బోర్ ద్వారా కూడా ప్రజలకు తాగునీరు అందుబాటులోకి రానుంది.
అదేవిధంగా గ్రామంలో ఎక్కడెక్కడ పైప్‌లైన్ లీకేజీలు, నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో పరిశీలించి, ఆయా సమస్యలను కూడా ప్రత్యేక దృష్టితో పరిష్కరించే చర్యలు చేపట్టారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట్ల తక్షణ చర్యలు తీసుకుంటూ, సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పార్నపల్లి కిషోర్, సీనియర్ నాయకులు కోడి రమణ, యూత్ అధ్యక్షులు రామ్ లక్ష్మణ్ రెడ్డి, చెన్నకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు