నిరుద్యోగ భృతిపై మాట తప్పారు కొట్లూరు సుదర్శన్
నిరుద్యోగ భృతి ₹3,000 ఇవ్వడానికి డబ్బుల్లేవు… ఇన్ఫ్లుయెన్సర్ల జీతాలకు మాత్రం ప్రజాధనం ఉందా?
యువతకు 3000 భృతి ఎప్పుడు ఇస్తారు? ప్రచార ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
హామీల అమలులో జాప్యం.. ప్రభుత్వ ప్రచారానికి మాత్రం ఆర్భాటమా?
నిరుద్యోగ భృతిపై మాట తప్పారు
పులివెందుల మేజర్ న్యూస్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన హామీ అయిన నిరుద్యోగ యువతకు ఇచ్చిన నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి హామీని ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలి.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మరోవైపు ప్రభుత్వ ప్రచారం ఆర్భాటాల కోసం ఇన్ఫ్లుయెన్సర్లకు పారితోషికాలు చెల్లించాలని అధికారికంగా ఆదేశిస్తే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చెప్పాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను నియమించింది? ఒక్కొక్కరికి నెలకు ఎంత జీతం ఇస్తోంది? ఇప్పటివరకు ఎంత ప్రజాధనం వెచ్చించాలని భావిస్తోంది? ఈ వివరాలను ప్రభుత్వం బహిరంగపరచాలి.
నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 ఇవ్వడం ప్రభుత్వానికి భారమా? ప్రభుత్వ ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు చెల్లించడం మాత్రం ప్రాధాన్యతగా మారిందా? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్లకేమో అక్రమ కేసులు అరెస్టులా! చేయని అభివృద్ధిని ప్రభుత్వాన్ని పొగిడిన వాళ్లకేమో వేలకు వేలకు పారితోషకాలా!
ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలి. ప్రచారా ఆర్భాటాలకు కొన్ని ఎల్లో మీడియా పచ్చ పత్రికలు ఉన్నా కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రజలను మరింత మభ్య పెట్టాలని ఈ ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది ఈ ఇన్ఫయెన్సర్ల నియామకం, వారి జీతాలు, చెల్లింపుల విధానం, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేయాలని అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రచారానికి మాత్రం ప్రజాధనం ఖర్చు చేస్తే యువత తరఫున ప్రశ్నించడం మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత.
₹3,000 నిరుద్యోగ భృతికి తేదీ ప్రకటించాలి… ఇన్ఫ్లుయెన్సర్లకు చెల్లించాలనుకుంటున్న జీతాల లెక్కలు ప్రజల ముందు పెట్టాలి.యువతకు భృతి కావాలి — ప్రచారానికి జీతాలు కాదు!
ప్రజాధనం ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయాలి
కోట్లూరు సుదర్శన్
బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ