BREAKING
టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది)

నేడు అనంత మేయర్ స్థానానికి బిజెపి అభ్యర్థి అజేష్ యాదవ్ నామినేషన్

Select Suryaa Now
నేడు అనంత మేయర్ స్థానానికి బిజెపి అభ్యర్థి అజేష్ యాదవ్ నామినేషన్

నేడు అనంత బిజెపి మేయర్ అభ్యర్థి అజయ్ యాదవ్ నామినేషన్


అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ :  అనంతపురం నగర మేయర్ అభ్యర్థిగా   బిజెపి నుంచి అజేష్ యాదవ్ ఆదివారం   నామినేషన్  దాఖలు చేయనున్నారు. మేయర్ స్థానం బిజెపికి కేటాయించినప్పటి నుంచి అభ్యర్థి ఎంపికలో గత రెండు రోజులుగా బిజెపి అధిష్టానం తీవ్ర కసరత్తులు చేపట్టింది. మరో ఇద్దరు బిజెపి నాయకులు పేర్లు కూడా ప్రముఖంగా వినిపించిన.. చివరకు అజేష్ యాదవ్ పేరును పార్టీ  నాయకత్వం ప్రకటించింది. మంత్రి సత్య కుమార్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులకు సన్నిహితుడుగా అజేష్ యాదవ్ గుర్తింపు ఉంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన టిడిపి, జనసేన మద్దతుతో  అజేష్ యాదవ్ బరిలో దిగనున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన అజేష్ యాదవ్ ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర నేతగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ.. సేవ  కార్యక్రమాలలో యాక్టివ్ గా ఉన్నారు. టిడిపి, జనసేన మద్దతుతో .. బరిలో దిగడంతో గెలుపు అవకాశాలపై బిజెపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నామినేషన్ కార్యక్రమానికి టిడిపి, జనసేన, బిజెపి రాష్ట్ర నేతలతో పాటు జిల్లా నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించి.. అనంతరం అజేష్ యాదవ్ నామినేషన్  వేసేందుకు కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.