BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

నామినేషన్ పరిశీలన

Select Suryaa Now
నామినేషన్ పరిశీలన

 నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ ఎం. విజయ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ ఎం. విజయ శుక్రవారం పరిశీలించారు.నామినేషన్ల స్వీకరణకు నిర్ణయించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో, నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు, అక్కడ చేపట్టిన ఏర్పాట్లు, ప్రక్రియ నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయపాలనను పాటిస్తూ, అభ్యర్థులందరికీ నిబంధనల ప్రకారం సమాన అవకాశాలు కల్పించాలని జనరల్ అబ్జర్వర్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, అదనపు ఎస్పీ  తరుణ్ పహ్వా, జెడ్పీ సీఈవో / జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి ఎం. రాజు, డీపీఓ వి. శాంతమణి, పి. వీణాదేవి, కె. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు.