ముగిసిన ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ
- పది ఎంపిటిసి స్థానాలకు 45 నామినేషన్లు దాఖలు
ఆత్మకూర్, మేజర్ న్యూస్ : నంద్యాల జిల్లా ఆత్మకూర్ ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ తెలిపారు. ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సాగగా పది ఎంపిటిసి స్థానాలకు 45 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి 20, వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి 20, బిజెపి 2, జనసేన పార్టీ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్ వచ్చినట్లు ఆర్ ఒ తెలిపారు. పది ఎంపిటిసి స్థానాల్లో కరివేన నుంచి 5, నల్ల కాలువ 4, కురుకుంద -1కి 4, కురుకుంద -2కి 3, ముష్టిపల్లి 6, పిన్నాపురం 4, వడ్ల రామాపురం5, సిద్దాపురం 4, కృష్ణాపురం6, శ్రీపతిరావుపేట 4 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.