ఇంటింటికి సురక్షిత త్రాగునీరు
కనిగిరి ,మేజర్ న్యూస్ :ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు ఎమ్యెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషి చేస్తున్నారని పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి అన్నారు .మంగళవారం పట్టణంలోని ఎమ్ ఎన్ ఎమ్ డిగ్రీ కళాశాల సమీపంలో జరుగుతున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించారు .ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఇంటింటికి కుళాయిల ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారానికి పట్టణంలో మూడు స్టోరేజి ట్యాంక్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు .ఎమ్యెల్యే సహకారంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు .ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ షరీఫ్ ,నీలిశెట్టి అంజినాయుడు ,బొందలపాటి మురళి ,చీర్ల నాగార్జున యాదవ్ తదితరులు ఉన్నారు .