ఇంకొల్లు మండలంలో మొత్తం 77 నామినేషన్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో మూడు రోజుల్లో 14 ఎం.పి.టి.సి స్థానాల నుండి మొత్తం 77 నామినేషన్లు వచ్చాయి. అధికంగా వైసీపీ నుండి 37 నామినేషన్లు, టి.డి.పి నుండి 32, జనసేన పార్టీ నుండి 7, ఇండిపెండెంట్ 1 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అత్యధికంగా గంగవరం ఎం.పి.టి.సి స్థానం నుండి 10 నామినేషన్లు వచ్చాయి. వంకాయలపాడు నుండి 4, పూసపాడు నుండి 5, ఇడుపులపాడు-1 నుండి 4, ఇడుపులపాడు-2 నుండి 4, నాగండ్ల నుండి 6, పావులూరు నుండి 6, ఇంకొల్లు-1 నుండి 4, ఇంకొల్లు-2 నుండి 6, ఇంకొల్లు-3 నుండి 4, ఇంకొల్లు-4 నుండి 6, గంగవరం నుండి 10, కొణికి నుండి 6, దుద్దుకూరు నుండి 6, భీమవరం నుండి 6 గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.