BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి రూ.8 లక్షల పరిహారం చెల్లించాలి

Select Suryaa Now
గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి    రూ.8 లక్షల పరిహారం చెల్లించాలి

ఏలూరు, సూర్య న్యూస్ :గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ కాకినాడ డిపో ఆన్ కాల్ డ్రైవర్ జట్ల శివ కుటుంబానికి రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చి 8 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ ఏ.పి ఆర్టీసీ (పిడిటి) కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ అక్టోబర్ 8వ తేదీన గురువారం ఉదయం కాకినాడ డిపో నుండి జట్ల శివ (34) అని ఆన్ కాల్ డ్రైవర్ విశాఖపట్నం నాన్ స్టాప్ బస్సు కు డ్రైవింగ్ లో ఉండగా గుండె నొప్పితో ఏడు కిలోమీటర్లు ఆర్టిసి బస్సు నడిపి సురక్షితంగా నక్కపల్లి వరకు చేర్చి బస్ స్టీరింగ్ మీద కుప్ప కూలిపోవడం జరిగిందని , దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్లక అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్  ధ్రువీకరించారన్నారు.ఈ ఘటనపై  విద్య శాఖ మంత్రి నారా లోకేష్  డ్రైవర్ అంకిత భావానికి ప్రశంసలు తెలియజేశారన్నారు. అనేకమంది ఆర్టీసీలో ఆన్ కాల్, అద్దె బస్సు డ్రైవర్లు ,గ్యారేజీలో, ఆర్టీసీ పార్సెల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆన్ డ్యూటీ లో చనిపోయిన సందర్భాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి అని వారందరికీ న్యాయం చేయాలన్నారు.ఆర్టీసీలో రెగ్యులర్ కార్మికుడు ఆన్ డ్యూటీ లో చనిపోతే 80 లక్షల పరిహారం కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఆర్టీసీ యాజమాన్యం చెల్లిస్తుంది. అయితే చనిపోయిన కార్మికుడు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఆన్ కాల్ అనే పేర్లు కార్మికులకు పెట్టి నష్టపరిహారం ఆర్టీసీ యాజమాన్యం చెల్లించకపోవడం సరైనది కాదు, తక్షణం జట్ల శివ కుటుంబానికి రెగ్యులర్ ఉద్యోగ మాదిరిగానే 80 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని చనిపోయిన కార్మికుల కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు, అలాగే ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగ నియమకాలు 10 ఏళ్ల  క్రితం ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు, ఇప్పుడు కొత్తగా చేరే వారందరూ ఆన్ కాల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ పద్ధతిలో మాత్రమే తీసుకుంటున్నారు ఆర్టీసీ పేరుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ , బోనస్,కనీస చట్టాలు కూడా అమలు జరగటం లేదు అని, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వీరికి ఎటువంటి పరిహారం అందడం లేదని, కావున కార్మికులందరికీ అన్ని చట్టలు అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఏలూరు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, యూనియన్ కార్యదర్శి వి ఆర్ కుమార్, ట్రెజరర్ శివ, గణేష్ , సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు