BREAKING
8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ-- హాకీని ప్రోత్సహించాలి గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రభాకర్‌రెడ్డి ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ మకుటం గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం మంత్రి సుభాష్ జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సాయం ఆసియా క్రీడల్లో గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ రికార్డు 20 ఏళ్ల సమస్యకు మూడు నెలల్లో పరిష్కారం ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం,మిక్స్‌డ్ రిలేలో సరికొత్త జాతీయ రికార్డు నమోదు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు - ఏఎంసీ చైర్మన్ ఆరికట్ల 23వ అహుడ అథారిటీ సమావేశం రెవెన్యూ సిబ్బంది పనితీరుపై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కు ఫిర్యాదు కృష్ణపట్నం లో వైద్య శిబిరం న్యాయ విద్యతో రాజ్యాంగ విలువల పరిరక్షణ లా విద్యార్థులతో ఎంపీ అంబికా పల్లె పండుగకు పామూరు నుంచి భారీగా తరలిన కూటమి శ్రేణులు

గోమయంతో మహిళలకు ఉపాధి బాట -20 రకాల గోమయ ఉత్పత్తులపై శిక్షణ

Select Suryaa Now
గోమయంతో మహిళలకు ఉపాధి బాట -20 రకాల గోమయ ఉత్పత్తులపై శిక్షణ

శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం లోని నిరంతర పశువైద్య విద్య, సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఐసిఏఆర్ ఆర్థిక సహకారంతో  జరుగుతున్న 3 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా మంగళవారం రెండో రోజు మహిళలకు గోమయ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. పాడిపేట కామధేను గోసంరక్షణశాలకు చెందిన మోహనాచారి వనరుల వ్యక్తిగా హాజరై దీపాలు, ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కప్పులు, కీచైన్లు, సీడ్ బాల్స్, వినాయక ప్రతిమలు సహా 20 రకాల ఉత్పత్తుల తయారీని ప్రత్యక్షంగా శిక్షణను అందించారు. ముడి గోమయం సిద్ధం చేయడం నుండి మిశ్రమం, అచ్చులతో తయారీ, యంత్రాల వినియోగం, ఆరబెట్టడం వరకు ప్రతి దశను మహిళలతో స్వయంగా చేయించారు. గోమయాన్ని వ్యర్థంగా కాకుండా విలువైన ఉప ఉత్పత్తిగా మార్చి అదనపు ఆదాయం పొందవచ్చని, నాణ్యత, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కుచెందిన ఐసిఏఆర్-ఎన్ఎఆర్ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. ఎం.బాలకృష్ణ, విస్తరణ సంచాలకులు డా. బి. శోభామణి పాల్గొన్నారు. డా.బాలకృష్ణ మాట్లాడుతూ నైపుణ్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరని అన్నారు. కో-ఆర్డినేటర్ డా.కె.సుజాత సమన్వయంలో డా.ఎస్.శ్వేతకాంతి, డా.మంజరి, డా.రెడ్డి వరప్రసాద్ నిర్వహణలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి