BREAKING
వరుణ దేవుని ఆశీస్సులతో రైతాంగం సుభిక్షంగా ఉండాలి : ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రతి ఇంటికీ సోలార్‌ భరోసా.. - పెనమలూరులో 10 వేల ఇళ్లకు సోలార్‌ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జనవరి 15 నాటికి పేదల ఇళ్లు సిద్ధం - లబ్ధిదారులతో గృహప్రవేశాలు, సహపంక్తి భోజనాలు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉయ్యూరు నుంచే కూటమి విజయయాత్రకు శంఖారావం.. అభివృద్ధిలో పోటీ పడదాం.. నూతన కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ విధులపై సూచనలు డ్రైవర్‌ రామ్‌కుమార్‌ ఆత్మహత్య భర్త బతికే ఉన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం - పింఛన్ కోసం నకిలీ పత్రాలు.. ఈనెల 8వ తేదీ న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవాడ ఉత్సవ్‌ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం.. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ వైభవం గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం గుర్తుతెలియని ఒక శవం

గిరిజనుల సాగుభూములకు హక్కులు కల్పించాలి

Select Suryaa Now
గిరిజనుల సాగుభూములకు హక్కులు కల్పించాలి

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్  పో లవరం మండలం జిల్లెల్లగూడెం పంచాయతీలో గిరిజనులు 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని, జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి కూలి రూ.600 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెంలో ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.గంగానమ్మ గుడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఝాన్సీ మాట్లాడుతూ గిరిజనుల సాగులో ఉన్న భూములను ఇతరులకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రగడపల్లి, వింజరం, ఇటుకలకోట రెవెన్యూల్లో గిరిజనుల సాగులో ఉన్న భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు.ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుంజం రామారావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని, భూమికి భూమి ఇవ్వాలని, ముంపు గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయం దెబ్బతిందని నాయకులు పేర్కొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు తాటి బుల్లబ్బాయి, కే. మోహన్, పట్టెం పరమేశ్వరరావు, దాడి రాముడు, కారం దుర్గ, కొమరం రామారావు, తాతి చిన్ని తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా