గెలుపే ధ్యేయంగా పనిచేయాలి... ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు...
ముమ్మిడివరం మేజర్ న్యూస్ నియోజకవర్గం మురమళ్ళలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముమ్మిడివరం నగరపంచాయతి మున్సిపల్ ఎన్నికలకు సంబందించి NDA కూటమి నాయకులతో చర్చించిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పంచాయతీలోని 23 వార్డుల కౌన్సిలర్లతోపాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థిని గుబ్బల గంగా రత్న భవానిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, బిజెపి సీనియర్ నాయకులు, మాజీ పశుగణాభివృద్ధి శాఖా చైర్మన్ యాళ్ల దొరబాబు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బిజేపి మాజీ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు, బిజెపి పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.