BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.

ఎన్నికల్లో అందరికీ సమాన హక్కులు కల్పించాలి భద్రత కల్పించాలని డిమాండ్,. నామినేషన్ కేంద్రాల వద్ద.. వైకాపా అభ్యర్థులను అడ్డుకోవడంపై నాయకుల అభ్యంతరం.

Select Suryaa Now
ఎన్నికల్లో అందరికీ సమాన హక్కులు కల్పించాలి భద్రత కల్పించాలని డిమాండ్,. నామినేషన్ కేంద్రాల వద్ద.. వైకాపా అభ్యర్థులను అడ్డుకోవడంపై నాయకుల అభ్యంతరం.

వేముల మేజర్ న్యూస్:::---
ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు సందర్భంగా గురువారం వేముల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు బయలుదేరగా, కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని వేముల పంచాయతీ పరిధిలోని కృపా నగర్,జగనన్న కాలనీ  వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.

మాజీ పీసీబీ సభ్యుడు మరక శివకృష్ణారెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు నంద్యాలహేమాద్రి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ల దాఖలుకు భారీగా తరలివెళ్లారు. మరోవైపు వేల్పుల ఎంపీటీసీ అభ్యర్థి, మాజీ సర్పంచ్ లింగాల పార్వతమ్మ ఆధ్వర్యంలో మహిళలు, వేల్పుల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వైకాపా అభ్యర్థులను అడ్డుకోవడంపై అభ్యంతరం

కృపా నగర్ కాలనీ వద్ద అభ్యర్థులను మాత్రమే నామినేషన్ కేంద్రానికి అనుమతిస్తామని తెలిపారు,కానీ అభ్యర్థుల భద్రత పై బరోసా కల్పించ లేదు, దీంతో పోలీసులకు, వైకాపా నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల మద్దతు ఉన్న వైకాపా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

నామినేషన్ల ప్రక్రియపై చర్చ

వేముల మండలంలో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించడం కీలకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.వేముల ఎంపీటీసీ గా పేర్ల రామసుబ్బారెడ్డి, పోరెడ్డి రాఘవ రెడ్డి,పెద్ద జూటూరు ఎంపీటీసీ గా వద్దరపు రామలక్ష్మమ్మ,మీదిపెంట్ల ఎంపీటీసీ గా బొజ్జ శివలక్ష్మి,
,కొత్తపల్లి ఎంపీటీసీ గా శ్రీనివాసులు,మారుతి, చాగలేరు ఎంపీటీసీ గా యర్రంరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,గొల్లగూడూరు ఎంపీటీసీ గా గూడూరు నాగేంద్ర ,నల్ల చెరువుపల్లి ఎంపీటీసీ సుధ గంగాదేవి,వేల్పుల ఎంపీటీసీ గా షేక్ ఆఫ్రిన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గా పోటీకి సిద్ధ పడ్డారు.ఈరోజు అయిన వారితో అధికారులు పోలీస్ సిబ్బంది నామినేషన్ వేపిస్తారా లేక అలాగే రోడ్ పైనే వారిని బైఠాయిస్తారా,నామినేషన్ వేయించకోతే అభ్యర్థులు అలాగే నిరసన తెలిపి ధర్నా చేస్తారా వేసి చూడాలి.ఇప్పటికీ ఆయన పై స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారా.ప్రజాసామ్యాన్ని కాపాడతారో లేదో వేచి చూద్దాం.

చల్లా సునీల్ వేముల రిపోర్టర్ కడప జిల్లా