ఎన్నికల ప్రచారంలో రాజు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆత్మవిశ్వాసం, అంకితభావంతో వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తూ నవతరం పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి నందికోళ్ల రాజు మండపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన మూడు చక్రాల వాహనాన్నే ప్రచార రథంగా మలుచుకుని వీధివీధినా తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. మండపేట అభివృద్ధికి తనకు ఒక అవకాశం కల్పించాలని కోరుతూ కొబ్బరికాయ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. వైకల్యాన్ని అధిగమించి ప్రజాసేవకు ముందుకు వచ్చిన నందికోళ్ల రాజు ప్రచారం స్థానికంగా పలువురిని ఆకట్టుకుంది.