BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

ఎం.పి.టి.సి. నామినేషన్ సెంటర్ సందర్శించి న జిల్లా ఎస్పీ

Select Suryaa Now
ఎం.పి.టి.సి. నామినేషన్ సెంటర్ సందర్శించి న జిల్లా ఎస్పీ

గుర్ల, సూర్య : స్థానిక  ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ సెంటర్, గుర్లను భద్రత ఏర్పాట్ల భాగంగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ శుక్రవారం పర్యవేక్షించారు.  ఎం.పి.డి.ఓ.  కార్యాలయం, చుట్టూ ఉన్న పరిస్థితులు  నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్స్ స్వీకరణ, ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగే విధంగా భద్రత చర్యలు చేపట్టామని జిల్లాఎస్పీ  ఎఆర్ దామోదర్, ఐపీఎస్ తెలిపారు.జిల్లా లోజెడ్.పి.టి.సి,ఏం.పి.టి.సి. ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల వేళ జిల్లాలో సెక్షన్ 30 పోలీసు చట్టం, 163 బి.ఎన్.ఎస్.ఎస్. (143 సి.ఆర్.పి.సి) అమలులో ఉందని, ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించ రాదన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎం.సి.సి.) ని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు, రాజాకీయ పార్టీలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎక్కువ నగదు లావాదేవీలు జరిపే అనుమానస్పద వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టామన్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక దళాలను, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించామన్నారు.
ఉదయం 6గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలన్నారు. సహేతుకరమైన కారణాలు లేకుండా రాత్రి 10 గంటల తరువాత పట్టణాల్లోను, గ్రామాల్లో ఎవ్వరూ తిరగ వద్దన్నారు.జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏవీ లీలారావు, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి,  చీపురుపల్లి సిఐ జి.శంకరరావు, రాజాం సిఐ నవీన్ కుమార్, రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర, ఇతర పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది ఉన్నారు.

రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.