బీజేపీ సంస్థాగత విషయాలపై చర్చ
నగరం, మేజర్ న్యూస్:
స్థానిక మండల పరిధిలోని ఏలేటిపాలెంలో బీజేపీ మండల సమావేశం మండల కన్వీనర్ శెట్టిపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. బీజేపీ సంస్థాగత విషయాలు, స్థానిక ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసే అవకాశాలు చర్చించారు. సేవా సంకల్ప అభియాన్ ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంపల్లి జగన్నాధ శాస్ట్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కొలగాని సునీత, జిల్లా అధికారప్రతినిది జక్కా శ్రీనివాసరావు, ఫిషేర్మెన్ సెల్ కన్వీనర్ మోపిదేవి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అంకేం శివనాగేశ్వరరావు, సీనియర్ నాయకులు ఇంకొల్లు మాణిక్యాలరావు, చలపతిరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.