బెదిరింపులపై ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలి: పెద్దిరెడ్డి. ఏజెంట్లకు బెదిరింపులు తగదు. అడ్డుదారి మార్గాల్లో గెలవాలని ప్రయత్నాలు. కార్యకర్తలు సైనికులై పోరాడాలి.
బెదిరింపులపై ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలి: పెద్దిరెడ్డి.
ఏజెంట్లకు బెదిరింపులు తగదు.
అడ్డుదారి మార్గాల్లో గెలవాలని ప్రయత్నాలు. కార్యకర్తలు సైనికులై పోరాడాలి.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకుల బెదిరింపులపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రొంపిచెర్ల గ్రామపంచాయతీలో వైయస్సార్సీపీ అభ్యర్థి కోటా సుష్మ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డు మార్గంలో ఎన్నికలలో గెలవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పోలింగ్ బూతులలో కూర్చున్న ఏజెంట్లను బెదిరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికులై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, రెడ్డీశ్వర్ రెడ్డి, విజయ శేఖర్, దేవులపల్లి హరినాథ రెడ్డి, చెంచురెడ్డి, సలీం బాషా, సూర్యనారాయణ రెడ్డి, శ్రీనాథ్ నాయుడు, రామకృష్ణ నాయుడు, కమలాకర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి, రామనారాయణరెడ్డి, మంజూర్, నీరజాక్షులు నాయుడు, రవీంద్ర, బావాజీ సాహెబ్, ఓబులేషు, సైఫుల్లా ఖాన్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.