BREAKING
ఆపదలో అండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ - నలుగురికి రూ.5.66 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలు పంపిణీ వరుణ దేవుని ఆశీస్సులతో రైతాంగం సుభిక్షంగా ఉండాలి : ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రతి ఇంటికీ సోలార్‌ భరోసా.. - పెనమలూరులో 10 వేల ఇళ్లకు సోలార్‌ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జనవరి 15 నాటికి పేదల ఇళ్లు సిద్ధం - లబ్ధిదారులతో గృహప్రవేశాలు, సహపంక్తి భోజనాలు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉయ్యూరు నుంచే కూటమి విజయయాత్రకు శంఖారావం.. అభివృద్ధిలో పోటీ పడదాం.. నూతన కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ విధులపై సూచనలు డ్రైవర్‌ రామ్‌కుమార్‌ ఆత్మహత్య భర్త బతికే ఉన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం - పింఛన్ కోసం నకిలీ పత్రాలు.. ఈనెల 8వ తేదీ న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవాడ ఉత్సవ్‌ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం.. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ వైభవం గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం

2047 నాటికి ఏపీలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

Select Suryaa Now
 2047 నాటికి ఏపీలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

సూర్య అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ (హరిత విస్తీర్ణం) కలిగిన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో నాగబాబు అధ్యక్షతన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన హరిత కార్యక్రమాలు, లక్ష్యాలపై అన్ని శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలు గుర్తించి, 15 వేల ప్రైమరీ బెడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి మనుగడ శాతానికి (సర్వైవల్ రేట్) అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, 'రైట్ ట్రీ – రైట్ ప్లేస్' విధానంలో రావి, మర్రి, వేప, చింత, కానుగ, ఉసిరి, పనస, మోదుగ వంటి స్థానిక జాతులనే పెంచాలని సూచించారు. రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవెన్యూ, బ్లాక్ మరియు మియావాకీ పద్ధతుల్లో దట్టమైన అడవుల పెంపకాన్ని చేపట్టాలని నిర్దేశించారు.

రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించేందుకు కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు (మ్యాంగ్రోవ్స్), తాటి తోటలతో 'గ్రేట్ గ్రీన్ వాల్' కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలన్నారు. నర్సరీలను కేవలం మొక్కల కేంద్రాలుగానే కాకుండా స్థానిక యువత, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే 'గ్రీన్ ఎకానమీ' కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. పారదర్శకత కోసం నర్సరీ నుంచి నాటే వరకు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్, డ్యాష్‌బోర్డు పర్యవేక్షణ తప్పనిసరని.. “ఎక్కడ నాటాం? ఎన్ని నాటాం? ఎన్ని బతికాయి?” అనే ప్రశ్నలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని నాగబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.