ఆంధ్రప్రదేశ్ దిగ్దర్శనం పుస్తక ఆవిష్కరణ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన చరిత్ర, సంస్కృతి, ఆచారాలు సాంప్రదాయాలు స్వాతంత్ర సమరయోధులు, విజ్ఞాన వేత్తలు, కవులు, కళాకారులు, చారిత్రిక ప్రదేశాల గురించి లిఖించబడిన 'ఆంధ్రప్రదేశ్ దిగ్దర్శనం' అనే గ్రంధాన్ని ఎస్వీయూ వీసీ ఆచార్య టాటా నర్సింగరావు శుక్రవారం ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని వైవిధ్యమైన సాంస్కృతిక, జానపద ప్రత్యేకతలు, భాషా వైవిధ్యాలు, మాండలికములు, నదులు, పండుగలు, పంటలు, వంటలు ఆహార శైలి, సందర్శనీయ ప్రకృతి రమణీయ ప్రదేశాలు, గుహలు, శిల్ప చిత్రకళలు, రాజుల కాలం నాటి నిర్మాణాలు, పోరాటయోధులు, సంఘసంస్కర్తలు, విద్యావేత్తలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన వేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, సంగీతము, సాహిత్యం, నృత్యం, లలిత జానపద కళలు మొదలైన అనేక అంశములపై సంక్షిప్తంగా తయారుచేసిన ఈ పుస్తకం విద్యార్థులకు, నేటి తరానికి చెందిన అందరికీ ఎంతో ఉపయోగపడతుందన్నారు. అనంతరం క్యాప్స్ సభ్యులు ప్రొఫెసర్ వైవీ రామిరెడ్డి మాట్లాడుతూ సెంటర్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ స్టడీస్ సామాజిక, ఉన్నత విద్యాసంస్థల భాగస్వామ్యంతో పరిశోధనలు, సదస్సులు నిర్వహించి భారత దేశ ప్రగతి, వైభవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాత్రను విస్తృతంగా వెలుగులోనికి తీసుకురావటమే ఆంధ్రప్రదేశ్ అధ్యయన కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ ఎన్ చండ్రరాయుడు, రిజిస్టార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, ప్రొఫెసర్ ఎం రాజశేఖర్, ప్రొఫెసర్ దామోదర్, ప్రొఫెసర్ మధు, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ వివేక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్